02-01-2026 01:50:49 AM
28 జిల్లాలకు యూత్ అధ్యక్ష, కార్యదర్శుల నియామకం
హైదరాబాద్, జనవరి 1 (విజయక్రాంతి): తెలంగాణ రాజ్యాధికార పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పార్టీ యువజన విభాగం 28 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను నియమించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డుపల్లి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నియమించారు.
