02-01-2026 02:31:28 PM
బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్
మునిపల్లి,(విజయక్రాంతి): బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే ఊరుకోబోమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ అన్నారు. మండల పరిధిలోని మల్లికార్జున్ పల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి (నూతన సంవత్సర వేడుకల సందర్భంగా) బీఆర్ఎస్ నాయకులు, కాంగ్రెస్ నాయకుల మధ్య గొడవ జరిగింది. ఇందులో గాయాలైన బీఆర్ఎస్ నాయకుడు దిడ్గి పాండు సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్ ఆసుపత్రికి పాండును పరామర్శించి జరిగిన సంఘటనపై అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సాయికుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉందని కాంగ్రెస్ నాయకులు బీఆర్ ఎస్ నాయకులపై దాడులు చేయడం ఏమిటనిఆయన ప్రశ్నించారు. అందుకు బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ నాయకులు దాడులు చేస్తే ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు. బీఆర్ ఎస్ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యంగా ఉండాలన్నారు. బీఆర్ ఎస్ నాయకులపై భౌతిక దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, ఇలాంటివి మరోసారి పునరావృతమైతే చూస్తూ ఊరుకోమన్నారు. ఆయన వెంట బీఆర్ ఎస్ మండల ఉపాధ్యక్షుడు గడ్డం భాస్కర్, మైనారిటీ మండల పార్టీఅధ్యక్షుడు మౌలానా, నాయకులు దిడిగే విష్ణు కుటుంబ సభ్యులు తదితరులు ఉన్నారు.