11 May, 2026 | 1:39 AM

కోదాడ బాప్టిస్ట్ చర్చిలో మదర్స్‌డే

11-05-2026 12:48 AM

కోదాడ, మే 10 : కోదాడ బాప్టిస్ట్ చర్చిలో పాస్టర్ యేసయ్య ఆధ్వర్యంలో ఆదివారం మదర్స్ డే   వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లి ప్రేమకన్నా గొప్ప ప్రేమ ఎవరినుండి దొరకదని కొనియాడారు.  అధిక సంఖ్యలో క్రైస్తవులు హాజరై ప్రార్థనల్లో పాల్గొన్నారు. సంఘ విశ్వాసులు పెద్దలు యవ్వనస్థులు సంఘ పాటల బృందం  పాల్గొని ఒకరికొకరు  శుభాకాంక్షలు  తెలియ చేసుకున్నారు. ఈ కార్యక్రమం లో క్రైస్తవులు పాల్గొన్నారు.