విద్యార్థి దశ నుండే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
* పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
పటాన్చెరు, మే 10: ప్రస్తుత పోటీ ప్రపంచంలో మానసిక ప్రశాంతత, శారీరక ధారుడ్యత కోసం విద్యార్థి దశ నుండి క్రీడలపై ఆసక్తి పెంపొందించేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని.. నియోజకవర్గంలో క్రీడలు, క్రీడాకారుల అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు.
ఆదివారం పటాన్చెరు డివిజన్ పరిధిలోని భారత రత్న పివి నరసింహారావు ఆడిటోరియంలో ఎమ్మెల్యే జిఎంఆర్ సౌజన్యంతో లక్కీ మార్షల్ ఆరట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గూడెం విష్ణువర్ధన్ రెడ్డి స్మారక 10 జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్ షిప్ పోటీలకు ఎమ్మెల్యే జిఎంఆర్ ముఖ్యఅతిథిగా హాజరై లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే జిఎంఆర్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాలుగా జాతీయ స్థాయిలో కరాటే పోటీలు నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు.
వివిధ రాష్ట్రాల నుండి సుమారు 2000 మంది క్రీడాకారులు టోర్నమెంట్ కు హాజరు కావడం పటాన్చెరు నియోజకవర్గం యొక్క ఖ్యాతిని నలుదిశలా చాటి చెప్పినట్లు అయ్యిందని అన్నారు. దశాబ్దాల చరిత్ర కలిగిన పటాన్చెరు పట్టణంలోని మైత్రి మైదానాన్ని ఆధునికరించడంతోపాటు.. ఏడాది పొడవునా వివిధ క్రీడ అంశాల్లో రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయి క్రీడాకారుల కోసం నియోజకవర్గ వ్యాప్తంగా మూడు మినీ స్టేడియాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుత సమాజంలో మాదకద్రవ్యాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని. సమాజం నుండి వాటిని తరిమి కొట్టడంలో ప్రతి ఒక్కరూ కంకణబద్ధులు కావాలని విజ్ఞప్తి చేశారు.
విద్యార్థి దశ నుండి పిల్లలకు వాటి దుష్పరిమానాలను వివరించాలని కోరారు. కాగా కరాటే పోటీల నిర్వహణ కోసం ఎమ్మెల్యే జిఎంఆర్ 5 లక్షల రూపాయల సొంత నిధులను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్లు మెట్టు కుమార్ యాదవ్, అంజయ్య యాదవ్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, దశరథ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్ర రెడ్డి, మైత్రి క్లబ్ అధ్యక్షుడు హనుమంత్ రెడ్డి, వెంకటేష్, చంద్రశేఖర్, షకీల్, టోర్నమెంట్ నిర్వాహకులు రాజు యాదవ్, వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన క్రీడాకారులు, తల్లిదండ్రులు, అకాడమీ మాస్టర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






