11 March, 2026 | 2:51 PM

Breaking News

కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •  

ప్రేరేపిత.. అసత్య వార్తలను సహించబోం!

04-11-2024 12:41 AM
  1. ‘పోలీసులా.. కీలుబొమ్మలా’ కథనాన్ని ఖండిస్తున్నాం.. 
  2. ‘నమస్తే తెలంగాణ’పై ఎల్బీనగర్ జోన్ డీసీపీ ఫైర్

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 3 (విజయక్రాంతి): పోలీస్ డిపార్టెంట్‌మెంట్‌ను టార్గెట్ చేస్తూ ‘నమస్తే తెలంగాణ’ శనివారం ‘పోలీ సులా? కీలుబొమ్మలా?’ అన్న శీర్షికతో కథనం ప్రచురించిందని, జనాన్ని తప్పుదారి పట్టించేలా ఆసత్య, ప్రేరేపిత, పక్షపాత కథనాలను ప్రచురిం చడాన్ని సహించబోమని ఎల్బీనగర్ జోన్ డీసీపీ ప్రవీణ్‌కుమార్ ఆదివారం ఓ ప్రకటనలో హెచ్చరించారు.

ప్రేరేపిత.. అసత్య వార్తలను సహించబోమన్నారు. ఫేక్, ఫోర్జరీ, డాక్యుమెం ట్‌ను ఉపయోగించి  అసత్యకరమైన కథనాన్ని ప్రచురించడం సరికాదని అభిప్రాయపడ్డారు. కేసుల విచారణలో పోలీసులు చట్టపరంగా వ్యవహ రిస్తారని, విచారణలో ఎలాం టి ఒత్తిళ్లకు తలొగ్గేది లేదని స్పష్టం చేశారు.