1 September, 2026 | 7:49 PM

జీలచెరువు జెడ్పీహెచ్‌ఎస్‌లో విద్యార్థులకు ఇంగ్లీష్‌పై మోటివేషనల్ సెషన్

01-09-2026 | 06:33pm

కూసుమంచి,(విజయక్రాంతి): మండలంలోని జీళ్ళచెరువు జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో(Jeelacheruvu ZPHS School) విద్యార్థులకు ఇంగ్లీష్ భాష ప్రాధాన్యతపై మంగళవారం ప్రత్యేక మోటివేషనల్ సెషన్(Special motivational session) నిర్వహించారు. ఇంపాక్ట్ మోటివేషనల్ స్పీకర్ రుద్ర విద్యార్థులతో ఇంటరాక్టివ్‌గా మాట్లాడుతూ, ఇంగ్లీష్ మాట్లాడేందుకు ఉన్న భయాన్ని అధిగమించి ఆత్మవిశ్వాసం(Self-confidence)తో సంభాషించే విధానాలను వివరించారు. రోజువారీ జీవితంలో ఉపయోగించే సులభమైన ఇంగ్లీష్ పదాలు, వాక్యాలు, సంభాషణలను విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించారు.

తప్పులు చేయడానికి భయపడకుండా ప్రతిరోజూ కొద్దిసేపు ఇంగ్లీష్ మాట్లాడే సాధన చేయాలని రుద్ర సూచించారు. విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని పలు ప్రశ్నలు అడిగి, సెషన్‌ను ఆసక్తిగా వీక్షించారు. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ రీజియన్-3 ఆధ్వర్యంలో, శిక్షణ పొందిన ఇంపాక్ట్ ట్రైనర్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మోటివేషన్, వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ తదితర అంశాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి జెడ్పీహెచ్‌ఎస్  ప్రధానోపాధ్యాయులు తుమ్మ శ్రీనివాసరావు,  పాఠశాల ఉపాధ్యాయులు హాజరై విద్యార్థులను ప్రోత్సహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఇంగ్లీష్‌పై అవగాహన కల్పిస్తూ, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు ప్రేరణనిచ్చిన రుద్రను నిర్వాహకులు అభినందించారు.