21 July, 2026 | 11:46 AM

ఎం4ఎం సీక్వెల్

21-07-2026 01:08 AM

అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ ‘ఎం4ఎం’ (మోటివ్ ఫర్ మర్డర్) మూవీ 60 రోజుల విజయోత్సవాన్ని శాన్‌ఫ్రాన్సిస్కోలో నిర్వహించారు. ఈ వేడుకలో దర్శక -నిర్మాత మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మ కలిసి ‘ఎం ఫర్ ఎం 2’ సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. ‘సీక్వెల్ భారీ సైకాలజికల్ థ్రిల్లర్‌గా రానుంద’ని దర్శక-నిర్మాత తెలిపారు. ‘సీక్వెల్‌లో మరింత శక్తిమంతమైన పాత్రతో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు ఆసక్తి ఉన్నాన’నిహీరోయిన్ జో శర్మ చెప్పింది.