calender_icon.png 2 November, 2025 | 11:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుని పలకరించి.. ధాన్యం రాశిపోసి..

01-11-2025 08:25:51 PM

టేకుమట్ల వద్ద ధాన్యం ఆరబెడుతున్న రైతుని పలకరించిన జిల్లా ఎస్పీ నరసింహ 

సూర్యాపేట,(విజయక్రాంతి): సూర్యాపేట రూరల్ పరిధిలోని టేకుమట్ల గ్రామం వద్ద జాతీయరహదారిపై బ్లాక్ స్పాట్స్ ను, రోడ్డు ప్రమాద స్థలాలు, భద్రత చర్యలను పరిశీలించడానికి వచ్చిన జిల్లా ఎస్పీ నరసింహ రైతులను పలకరించి వారి కష్టసుఖాలను తెలుసుకున్నారు వ్యవసాయంలో మంచి రకమైన ధాన్యాన్ని ఎంచుకుని మంచి దిగుమతి పొందాలనీ సూచించారు. విత్తనాల కొనుగోలు, ధాన్యం అమ్మకాల విషయంలో ఎక్కడ కూడా దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. తదుపరి వారితో కలిసి ధ్యానంను రాశిపోశారు. ఈయన వెంట డీ ఎస్పీ ప్రసన్న కుమార్, సీఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, ఎస్సై బాలు నాయక్ సిబ్బంది ఉన్నారు.