వాహనదారులు హెల్మెట్ తప్పనిసరి ధరించాలి : సీఐ రామకృష్ణారెడ్డి
14-04-2026 12:00 AM
కోదాడ (మునగాల)ఏప్రిల్ 13,వాహనదారులు ప్రయాణ సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని మునగాల సీఐ రామకృష్ణారెడ్డి కోరారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా అరేయ్ ఎలైవ్ నినాదంతో రోడ్డు భద్రత వారోత్సవాలను పురస్కరించుకొని నడిగూడెం గ్రామ పంచాయతీలో సోమవారం నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని మాట్లాడుతూ ప్రతి సంవత్సరం జరిగే రోడ్డు ప్రమాదాలకు మానవ తప్పిదాలే ప్రధాన కారణమవు తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో తహసిల్దార్ సోమపంగు సూరయ్య, ఎంపీడీవో మాల్సుర్ నాయక్, ఎస్త్స్ర జి అజయ్ కుమార్, ఏపిఎం దుర్గాప్రసాద్,ఏవో మల్సుర్,పల్లె దవాఖాన డాక్టర్ హరినాథ్,సర్పంచ్ దున్నా శ్రీనివాస్, ఉప సర్పంచ్ ఎలుగురి నాగరాజు,ఆర్‌ఐ గోపాలరావు,పంచాయతీ కార్యదర్శి యలక ఉమారాణి, జిపిఓ కోటయ్య పాల్గొన్నారు.




