14 April, 2026 | 2:31 AM

దోస్త్ ద్వారా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

14-04-2026 12:00 AM
  1. ఉమ్మడి జిల్లాలో 20వేల అడ్మిషన్లు

జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలకు న్యాక్ ఏ గ్రేడ్

నల్లగొండ టౌన్, ఏప్రిల్ 13 : దోస్త్ ద్వారా రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం (2026-27)లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి నిర్వహించే దోస్త్ నోటిఫికేషన్ను తెలంగాణ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి మే 7వ తేదీ వరకు తొలి విడతలో సీట్ల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అటానమస్ దోస్తు కోఆర్డినేటర్ డాక్టర్ సుంకరి రాజారామ్ తెలిపారు.

ఉమ్మడి నల్గొండ జిల్లా లోమహాత్మా గాంధీ యూనివర్సిటీ పరిధిలో38 ప్రభుత్వ ప్రైవేటుడిగ్రీ కళాశాలలు ఉన్నాయి. 20,వేల నుండి 25,వేల అడ్మి షన్ లు డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరుటకు అవకాశం ఉంది. జిల్లాలో ప్రధానంగా నాక్ ఏ గ్రేడ్ పొందిన ఏకైక కళాశాల నల్గొండ జిల్లా కేంద్రంలో ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల. అర్హులైన విద్యార్థులు రూ.200 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఏప్రిల్ 30వ తేదీ నుంచి మే 8వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పించారు. మే 14వ తేదీన తొలి దశ సీట్ల కేటాయింపు జరగనుంది.

సీట్ల కేటాయింపు అనంతరం ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 15వ తేదీ నుంచి మే 25వ తేదీ వరకు కొనసాగనుంది. మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. మే 30వ తేదీ సీట్లు కేటాయిస్తారు. మూడో విడత రిజిస్ట్రేషన్ ప్రక్రియ మే 31వ తేదీ నుంచి జూన్ 15వ తేదీ వరకు జరగనుంది. జూన్ 16వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు.

జూన్ 20వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది. రెండో, మూడో విడత సీట్ల కేటాయింపు అనంతరం కూడా ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కాలేజీల్లో జూన్ 20 నుంచి 27వ తేదీ మధ్యలో హాజరై అడ్మిషన్ పక్రియ పూర్తి చేయాల్సి ఉంటుంది. జూన్ 29, 30వ తేదీల్లో విద్యార్థిని విద్యార్థులకు ఓరియంటేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి

 మహిళల కోసమే ప్రత్యేక కళాశాల 

సుంకరి రాజారాం దోస్త్ కోఆర్డినేటర్ నల్లగొండలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల( అటానమస్ ) అన్ని సౌకర్యాలతో కూడిన విద్యను అందిస్తుందని, కళాశాలలో అనుభవజ్ఞులైన అధ్యాపకులు ఉన్నారని, కళాశాలలో ఇన్ఫర్మేషన్ మరియు కమ్యూనికేషన్ టెక్నాలజీతో కూడిన విద్య, అదనాతనమైన లేబరేటరీలు, విశాలమైన గ్రంథాలయం, విద్యార్థినిలకు జిమ్ సౌకర్యం, ఆర్. ఓ తో కూడిన తాగునీటి సౌకర్యం అనేక సౌకర్యాలు ఉన్నందున ఈ కళాశాలలో చేరి తమ అభ్యున్నతికి బంగారు బాటలు వేసుకోవాలి.