4 May, 2026 | 9:36 PM

పూర్తిస్థాయి పరిహారం వచ్చేంతవరకు అండగా ఉంటా.. కవిత హామీ

04-05-2026 08:09 PM

బాధిత రైతు కుటుంబాల ఓ దారుస్తున్న మౌనిక రాథోడ్

బోత్,(విజయక్రాంతి): మండలంలోని కనుగుట్ట గ్రామానికి చెందిన రైతుల పంటలు కారిపోవడంతో తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర అధ్యక్షురాలు కవిత రైతు కుటుంబాల వారిని ఫోన్లో ఓదార్చారు. ఆ పార్టీకి చెందిన మౌనిక రాథోడ్ గ్రామానికి చేరుకొని కాలిపోయిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె బాధిత రైతు కుటుంబాల వారితో  ఫోన్లో కవిత మాట్లాడింది.

ఈ సందర్భంగా ఆమె పూర్తిస్థాయి నష్టపరిహారం అందే విధంగా చూస్తామని అందకపోతే మీకు అండగా ఉండి ఆందోళన కార్యక్రమాలను చేపడతామని రైతు కుటుంబాల వారికి హామీ ఇచ్చారు. ఫైర్ స్టేషన్ మంజూరి తాము చేయించామంటూ బి ఆర్ ఎస్ కాంగ్రెస్ పార్టీ ల నాయకులు పేర్కొనడం  హాస్యాస్పదంగా ఉందన్నారు, గత పాలకులు పట్టించుకోకపోవడం వలన ఈ దుస్థితి నెలపొందని ఆమె ఫోన్లో బాధితులకు వివరించారు.ఏది ఏమైనా తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.