18 April, 2026 | 10:51 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

సినీ నటుడు మోహన్‌బాబు ఇంట్లో చోరీ

26-09-2024 01:30 AM

రూ.10 లక్షలతో ఉడాయించిన పనిమనిషి

మహేశ్వరం, సెప్టెంబర్ 25: ప్రముఖ సినీ నటుడు మోహన్‌బాబు ఇంట్లో చోరీ జరిగింది.  పహాడీ షరీఫ్ పోలీసులు తెలిపిన వివరాలు.. రంగారెడ్డి జిల్లా జల్‌పల్లి మున్సిపాలిటీలోని మంచు టౌన్‌షిప్‌లో సినీ నటుడు మోహన్‌బాబుకు ఇల్లు ఉంది.

12 ఏళ్లుగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి అందులోనే నివసిస్తున్నారు. ఆ ఇంట్లో కిరణ్ తేజ్, గణేశ్ అనే ఇద్దరు వ్యక్తులు పనిచేస్తున్నారు. సోమవారం కిరణ్‌తేజ్, గణేశ్ తిరుపతిలోని మోహన్‌బాబుకు సంబంధించిన మరో ఇంటినుంచి జల్‌పల్లిలోని ఇంటికి రూ.10 లక్షలు నగదు తీసుకువచ్చారు.

ఆ తర్వాత కిరణ్‌తేజ్ పడుకోడానికి వెళ్లాడు. కాసే పటి తర్వాత ఇంట్లో గణేశ్‌తోపాటు తిరుపతి నుంచి తీసుకువచ్చిన నగదు కూడా కనిపించకపోవడంతో.. కిరణ్‌తేజ్ విషయాన్ని ఇంటి యజమాని మోహన్‌బాబుకు చెప్పాడు. దీంతో మోహన్‌బాబు సలహా మేరకు కిరణ్‌తేజ్ సోమవారం రాత్రి పహాడీషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి.. గణేశ్‌ను తిరుపతిలో అదుపులోకి తీసుకోవడంతో పాటు అతడి వద్ద నుంచి రూ.10 లక్షలు రికవరీ చేశారు.