calender_icon.png 31 October, 2025 | 8:02 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ పరీవాహకంలో అధికారుల పర్యటన

26-09-2024 01:28:40 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 25:  మూసీనదిని సుందరీకరించి పూర్వవైభవం తీసుకువస్తామని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించిన నేపథ్యంలో.. అధికారులు ఆ దిశగా పనులు ప్రారంభించారు. ఇందులో భాగంగా మూసీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి అక్రమ నిర్మాణాలను తొలిగించడానికి ప్రణాళికలు రూ పొందిస్తున్నట్లు సమాచారం.

నిర్వాసితులకు జీహెచ్‌ఎంసీ పరిధిలోని డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు కేటాయించడంతో పాటు ఆర్థిక భరోసా, ఇతర సంక్షేమ పథకాలు అందిస్తామని అవగాహన కల్పిస్తున్నారు. ఈ క్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలోని  చైతన్యపురి, కొత్తపేట డివిజన్లలోని మూసీ పరీవాహక ప్రాంతాల్లో బుధవారం జీహెచ్‌ఎంసీ అధికారులు పర్యటించారు. కాగా కొన్నిచోట్ల అధికారులను స్థానికులు అడ్డుకున్నారు.