calender_icon.png 12 December, 2025 | 11:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిజర్వేషన్ల అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించిన ఎంపీ చామల

11-12-2025 05:53:59 PM

న్యూఢిల్లీ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశాన్ని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) లోక్‌సభ జీరో అవర్ లో ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుందని.. బిల్లును సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మంత్రివర్గం, అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించారని పేర్కొన్నారు. అలాగే రిజర్వేషన్ల బిల్లును ఆరు నెలల క్రితమే గవర్నర్ వద్దకు పంపించామని... బిల్లు పంపి ఆరు నెలలు గడిచినా గవర్నర్ నిర్ణయం తీసుకోలేదన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం(PM Narendra Modi) చేసుకుని బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదింపచేయాలని ఎంపీ చామల కోరారు.