11-12-2025 02:50:30 PM
ప్రభాకర్ రావుకు ఎదురుదెబ్బ
న్యూఢిల్లీ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకు(Prabhakar Rao) ఎదురుదెబ్బ తగిలింది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు(Supreme Court Orders) ఆదేశించింది. సిట్ దర్యాప్తు అధికారి ముందు లొంగిపోవాలని సూచించింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు లొంగిపోవాలని తెలిపింది. జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం కస్టోడియల్ దర్యాప్తుకు సిట్ కు అనుమతించింది. ప్రభాకర్ రావుకు భౌతికంగా ఎలాంటి హాని లేకుండా చూడాలని ధర్మాసనం అధికారులకు ఆదేశించింది.