4 July, 2026 | 12:50 AM

జోగుళాంబ క్షేత్రంలో ఎంపీ డీకే అరుణ ప్రత్యేక పూజలు

04-07-2026 12:00 AM

అలంపూర్ జూలై 3: జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను శుక్రవారం బీజేపీ నాయకురాలు, మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చారణల మధ్య ఆమెకు పూర్ణకుంభ స్వాగతం పలికి స్వామి, అమ్మవార్ల దర్శనం కల్పించారు.

అనంతరం డీకే అరుణ ఆలయ విశిష్టత, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలని, రైతులు, యువత, అన్ని వర్గాల ప్రజలకు ఆయురారోగ్యాలు, శ్రేయస్సు కలగాలని ప్రార్థించినట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఆమెకు తీర్థప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రామాంజనేయులు , రాజగోపాల్ పార్టీ కార్యకర్తలు, ఆలయ అధికారులు,  పాల్గొన్నారు.