4 July, 2026 | 12:50 AM

ఆధునిక సాగుతో పత్తి దిగుబడి పెంచుకోవాలి

04-07-2026 12:00 AM

ఎమ్మెల్యే విజయుడు

అలంపూర్, జూలై 3: వడ్డేపల్లి మండల కేంద్రంలో వ్యవసాయ శాఖ జోగులాంబ గద్వాల జిల్లా ఆధ్వర్యంలో ’మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ (కాపాస్ కాంతి) 20262031’ కార్యక్రమంపై శుక్రవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ముఖ్య అతిథిగా హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయుడు మాట్లాడుతూ, ఆధునిక వ్యవసాయ సాంకేతికతలను అవలంబించడం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడులు సాధించడంతో పాటు నాణ్యమైన పత్తి ఉత్పత్తి చేయవచ్చని అన్నారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న ’కాపాస్ కాంతి’ కార్యక్రమాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని పత్తి సాగులో ఉత్పాదకతను పెంచుకోవాలని సూచించారు. అనంతరం వ్యవసాయ శాఖ అధికారులు రైతులకు హై డెన్సిటీ ప్లాంటింగ్ సిస్టమ్ క్లోజర్ స్పేసింగ్, ఇంటిగ్రేటెడ్ క్రాప్ మేనేజ్మెంట్ (వంటి ఆధునిక సాగు విధానాలపై అవగాహన కల్పించారు.

శాస్త్రీయ పద్ధతులను అనుసరించడం ద్వారా పంట దిగుబడితో పాటు నాణ్యత కూడా మెరుగుపడుతుందని వివరించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.