18 June, 2026 | 1:53 AM

పూర్వ విద్యార్థులను సన్మానం చేస్తున్న ఎంపీ నాగేష్

18-06-2026 12:22 AM

సంస్కృతి చదువుల నిలయం శిశు మందిరం 

నిర్మల్ జిల్లా కేంద్రంలో సరస్వతి శిశు మందిరం పునః ప్రారంభం 

నిర్మల్ జూన్ 17 ( విజయక్రాంతి): చదువుతోపాటు సంస్కారాన్ని దేశభక్తిని చాటి చెప్పడంలో శిశు మందిరాల పాత్ర ఎంతో కీలకమని ఆదిలాబాద్ ఎంపీ జి నాగేష్ అన్నారు. బుధవారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని బాగులవాడ శిశు మందిర్ ఉన్నత పాఠశాల పునః ప్రారంభం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో మొట్టమొదటి ప్రారంభమైందని ఇది తెలంగాణ వ్యాప్తంగా విస్తరించి ఎందరో మేధావులకు నిలయమైంది అన్నారు.

శిశు మందిరంలో చదువుతోపాటు సంస్కారం జాతీయ భావం పెంపొందించడంలో శిశు మందిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. విద్యా రంగంలో పోటీ నెలకొన్న నేపథ్యంలో శిశు మందిరాలు ఇంగ్లీష్ మీడియం తో పునః ప్రారంభించడం పూర్వవైవం తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పాఠశాలలో చదివిన పూర్వ విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించి పాఠశాల పునారు అభివృద్ధికి చేయూతనందించడం అభినందనీయమన్నారు.

పూర్వ విద్యార్థులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి, ప్రముఖ వైద్యులు అప్పాల చక్రధరి డాక్టర్ కృష్ణంరాజు డాక్టర్ రామకృష్ణ పూర్వ ఆచార్యులు స్థానిక కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ ఎస్పి రాజు తదితరులు ఉన్నారు.