18 April, 2026 | 2:34 AM

ఎంపీ తేజస్వి సూర్యని భర్తరఫ్ చేయాలి

18-04-2026 12:59 AM

తెలంగాణ వాది, ఉద్యమకారుడు, కళాకారుడు ప్రదీప్ కుమార్

జగిత్యాల, ఏప్రిల్ 17(విజయక్రాంతి)రాజకీయాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అపహాస్యం చేసేలా వ్యాఖ్యలు చేసిన ఎంపీ తేజస్వి సూర్య ను పదవి నుంచి తక్షణమే భర్తరఫ్ చెయ్యాలని తెలంగాణవాది, ఉద్యమకారుడు, జానపద కలకారుడు అ లుగునూరి @ మోరపల్లి ప్రదీప్ కుమార్ భారత ప్రభుత్వం ను డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా కేం ద్రంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజం, తెలంగాణా తల్లీ క్షోబించేలా ఒక ఎంపీ స్థాయిలో ఉన్న వ్యక్తి వ్యాఖ్యలు చేయడం విచారకరం అన్నారు.

దేశ భవిష్యత్, అభివృద్ధి, ప్రజా సంక్షేమం కొరకు పాటుపడే ప్రజాప్రతినిధుల సభలో ఇలాంటి అజ్ఞని ఉండడం దురదృష్టకరం అని తెలిపారు. పన్నెండు వందల మంది ఆత్మబలిదానాలు, నాలుగు కోట్ల తెలంగాణా సమాజం ఏకతాటిపైకి వచ్చి పోరాడి సాధించుకున్న తెలంగాణా రాష్ట్రాన్ని భారత్ - పాక్ విభజనతో పోల్చడం ఆయన అవివేకానికి నిదర్శనం అన్నారు.

స్వయం పాలనలో పదేళ్లు గడిచి, దేశంలోనే రోల్ మోడల్గా నిలిచిన తెలంగాణా రాష్ట్రంపై ఇంకా అక్కసు వెళ్ళగక్కడం వెనుక అంతర్యం ఏంటని ప్రశ్నించారు. తేజస్వి సూర్య తక్షణమే తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, ఉద్దేశ పూర్వకంగా వ్యాఖ్యలు చేసి, వక్రీకరించారని బుకయించడం సరికాదన్నారు.

ఆయనను తక్షణమే ఎంపీ పదవి నుంచి భర్తరఫ్ చేయడంతో పాటుగా, విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేసి తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసినందుకు గాను ఆయన్ని భవిష్యత్ లో ఏ పదవికి పోటీ చేయకుండా అనర్హత వేటు వెయ్యాలని భారత ప్రభుత్వం కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు పై గానీ, తెలంగాణ సమాజం పై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.