వైభవంగా చండీయాగం
18-04-2026 01:00 AM
ముకరంపుర, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి): వసంత రుతువు చైత్రమాస అమావాస్య శుక్రవారం ను పురస్కరించుకొని వైభ వంగా చండీయాగం జరిగింది. ప్రముఖ జ్యో తిష్య, వాస్తు, ఆగమ, శాస్త్ర పండితుడు నమిలకొండ రమణాచార్య స్వామి ఆధ్వర్యంలో దేవుళ్లపురి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలోని యజ్ఞశాలలో నవ చండీయాగాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమం లో పండితులు గోపీశర్మ, శివరామకృష్ణ, న మిలకొండ రామకృష్ణ, మధుసూదనాచార్యులు, రాఘవాచార్యులు, వినయ్ స్వామి, వివేక్ స్వామి, విష్ణుమాచార్యులు, ఆకాశ్ స్వా మి, లక్ష్మీనాచారి స్వామి, వెల్మ సంఘం అధ్యక్షులు నీలగిరి హనుమంతరావు, బిఆర్‌ఎస్ నాయకులు ఓరుగంటి రమణారావు, తదితరులు పాల్గొన్నారు.






