20 April, 2026 | 5:12 PM

ఉపాధి హామీ కూలీలకు స్వీట్ల పంపిణీ

20-04-2026 04:09 PM

బోథ్,(విజయక్రాంతి): మండలంలో చేపడుతున్న ఉపాధి హామీ పనులను సోమవారం బోత్ ఎంపీడీవో రమేష్ ఎపిఓ జగదేరావులు బోత్ గ్రామపంచాయతీ పరిధిలో చేపడుతున్న ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. నాలుగు గంటల పాటు తప్పనిసరిగా పనిచేయాలని కూలీలకు సూచించారు. కొలతల ప్రకారం పని చేస్తే ఆశించిన స్థాయిలో డబ్బులు వస్తాయని వివరించారు. పని ప్రదేశంలో తాగునీటి వసతి తప్పకుండా కల్పించాలని మేట్లను కోరారు. ఫారం ఫండ్ పనుల వల్ల భూగర్భ జలాలను పెరుగుతాయని దీంతో భవిష్యత్తులో త్రాగునీటి ఎద్దడి రాకుండా ఉంటుందన్నారు. కాగా ఉపాధి హామీ కూలీలను ప్రోత్సహించేందుకుగాను పని ప్రదేశంలోకి వెళ్లి స్వీట్లు పంపిణీ చేశారు