02-12-2025 06:02:13 PM
సుల్తానాబాద్ (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలో 27 గ్రామాలకు గాను 8 నామినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, మంగళవారం ఎంపీడీవో దివ్య దర్శన్ రావు అన్ని నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు. బుధవారం నుండి స్థానిక సంస్థలకు సంబంధించి నామినేషన్లు వేసేవారికి ఏలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అలాగే నామినేషన్ కేంద్రాల్లో నామినేషన్లు స్వీకరించే సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగిందన్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద హెల్ప్ డెస్క్ తో పాటు ఇతరత్రా అన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.