calender_icon.png 2 December, 2025 | 6:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతర్ జిల్లా చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎస్పీ రాజేష్ చంద్ర

02-12-2025 06:04:51 PM

కామారెడ్డి (విజయక్రాంతి): సిరిసిల్ల జిల్లా సరిహద్దు ప్రాంతమైన కామారెడ్డి జిల్లా సరిహద్దు మాచారెడ్డి పోలీస్ స్టేషన్ పరిధిలోని చెక్ పోస్టును మంగళవారం ఎస్పీ యం. రాజేష్ చంద్ర ఐపీఎస్ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్శనలో ఎస్పీ చెక్‌పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలకు సంబంధించిన రిజిస్టర్లు, రికార్డులను పరిశీలించి, విధుల్లో ఉన్న సిబ్బందికి పలు ముఖ్య సూచనలు చేశారు. ఎన్నికల సమయంలో అక్రమ డబ్బు, అక్రమ మద్యంనిషేధిత వస్తువుల రవాణా అవకాశాలు ఎక్కువగా ఉంటాయని గుర్తుచేస్తూ, చెక్‌పోస్ట్ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను సక్రమంగా వినియోగిస్తూ ప్రతి వాహనాన్ని పద్ధతిగా, క్షుణంగా తనిఖీ చేయాలని ఎస్పీ ఆదేశించారు. డ్యూటీ రోస్టర్ ప్రకారం సిబ్బంది క్రమబద్ధంగా విధులు నిర్వహించాలనీ, వాహనాలు, అనుమానస్పద వ్యక్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల భద్రత విషయంలో ఎటువంటి నిర్లక్ష్యం సహించబడదని స్పష్టం చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, అక్రమ కార్యకలాపాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదు. విధుల్లో ఎవరూ నిర్లక్ష్యం వహించరాదు. ప్రజలకు శాంతి భద్రతలు అందిచాడమే పోలీస్ శాఖ అత్యున్నత ప్రాధాన్యం. ఎన్నికలను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు పూర్తి బాధ్యతతో పనిచేస్తున్నారు. జిల్లాలో ఎన్నికల కోడ్ పకడ్బందీగా అమలు చేస్తున్నాం. ఇప్పటికే ఫ్లైయింగ్ స్క్వార్డ్స్, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశాం. ఎన్నికలు ముగిసేవరకు ఈ బృందాలు 24/7 తనిఖీలు కొనసాగిస్తాయి” అని తెలిపారు. చెక్ పోస్ట్ తనిఖీ సందర్భంగా ఎస్పీతో పాటు మాచారెడ్డి యస్ఐ అనిల్ కుమార్, చెక్‌పోస్ట్ విధుల్లో ఉన్న సిబ్బంది పాల్గొన్నారు.