04-02-2026 02:32:20 PM
బెజ్జూర్,(విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని మర్తిడి గ్రామం లోని ఉపాధిహామీ పనులను ఎంపీడీవో ప్రవీణ్ కుమార్ పరిశీలించారు. ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రతికూలి 307రూపాయల కూలి పడే విదంగా పని చేయాలనీ సూచించారు. ఉపాధి హామీ కూలీలు సక్రమంగా పనికి వెళ్తేనే కూలీ డబ్బులు వస్తాయని తెలిపారు. కూలీల సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారందరికీ ఉపాధి హామీ పనులు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మల్లేష్, ఏపీవో రాజన్న, టి ఏ విజయ్, ఆపరేటర్ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.