20-02-2026 10:02:21 PM
మోతె,(విజయక్రాంతి): గ్రామాల అభివృద్ధికి వార్డు సభ్యులు తోడ్పాటును అందించాలని ఎంపీడీఓ ఆంజనేయులు అన్నారు. శుక్రవారం శ్రీ శక్తి భవన్ లో ఏర్పాటు చేసిన వార్డ్ సభ్యుల మొదటి విడత ఐదవ రోజు శిక్షణ ముగింపు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు గ్రామాలలో ప్రతి ఒక్కరికి అందే విధంగా చూడాలి.
అర్హులైన పేదలకు పెన్షన్ లు, ఇందిరమ్మ ఇండ్లు, గ్రామాలలో పరిసరాల పరిశుభ్రత ను కాపాడటకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. సుమారు 15 గ్రామాల నుంచి 96 మంది వార్డ్ సభ్యులు హాజరై నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల కార్యదర్శి లు, వార్డ్ సభ్యులు ఉపేందర్ రెడ్డి, వీరబాబు, తరుణ్, నవీన్, యశోద రమేష్, మాలోతు ఈశ్వరి రవి, అశ్విని రామోజీ తదితరులు పాల్గొన్నారు.