16 April, 2026 | 5:55 AM

ఫార్మర్ రిజిస్టర్ తోనే రైతులకు అభివృద్ధి పథకాలు

20-02-2026 10:06 PM

ఫార్మర్ రిజిస్టర్ తోనే రైతులకు అభివృద్ధి పథకాలు

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు ఫార్మర్ ఐడి తప్పనిసరి

గరిడేపల్లి,(విజయక్రాంతి): ఫార్మర్ రిజిస్టర్ తోనే రైతులకు అభివృద్ధి పథకాల లబ్ధి చేకూరుతుందని వ్యవసాయ శాఖ ఏఈ త్రివేణి అన్నారు. మండలంలోని కొండాయిగూడెం గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ కందుల మంగమ్మతో కలిసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల లబ్ధి కొరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు పాస్ పుస్తకం,ఆధార్ కార్డు లింక్ అయిన ఫోన్ నెంబర్ తీసుకొచ్చి ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రైతులను కోరారు.భీమ,రుణాలు భవిష్యత్తు ప్రయోజనాలు ఉపయోగపడతాయని,ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో కేతిరెడ్డి చెన్నారెడ్డి,నాగిరెడ్డి,కందుల వెంకటరెడ్డి,నరసింహారావు పలువు రైతులు పాల్గొన్నారు