7 April, 2026 | 9:27 PM

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రి సలాన్ని పరిశీలించిన ఎమ్మార్వో

07-04-2026 07:47 PM

ఉప్పల్,(విజయక్రాంతి): ఉప్పల్ నియోజకవర్గంలోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి మంజూరైన నేపథ్యంలో మల్లాపూర్ సర్కిల్ 84 సర్వే నెంబరు ఉన్న కాలి స్థలాన్ని ఉప్పల్ తహసిల్దార్ పూల్ సింగం స్థానిక మాజీ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి తో కలిసి మంగళవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వంద పడకల ప్రభుత్వాసుపత్రి మంజూరై నేపథ్యంలోనే ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రభుత్వ స్థలాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రజలకు ఉపయోగపడే విధంగా అందుబాటులో ఉండే స్థలంలో నిర్మించాలని ఆలోచనలతో స్థలాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సర్వే నెంబర్ 84 లో ఉన్న ఖాళీ స్థలం ఆస్పత్రి నిర్మాణానికి అనుకూలంగా ఉందని దీనిపై ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జలమండలి డీజిఎం వేణుగోపాల్ మేనేజర్ రోహిత్ రెవిన్యూ అధికారులు స్థానిక డిఆర్ఎస్ నాయకులు వాసు గౌడ్ తిగుళ్ల  శ్రీనివాస్ గౌడ్ ఉస్మాన్ ప్రవీణ్ పాల్గొన్నారు