calender_icon.png 24 December, 2025 | 2:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిసెస్ ఇండియా రన్నరప్ సుదీప్తా

24-12-2025 12:16:28 AM

జాతీయ అందాల పోటీలో తెలంగాణ మహిళ విజయం

హైదరాబాద్, డిసెంబర్ 23 (విజయక్రాం తి): గచ్చిబౌలిలో నివసించే హైదరాబాద్‌కు చెందిన సుదీప్తా దాస్.. ఈ నెల 21న జైపూర్‌లో నిర్వహించిన మిసెస్ ఇండియా-2025 జాతీయ పోటీల్లో రన్నరప్ టైటిల్ను సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచారు. ఈ ప్రతిష్టాత్మక పోటీలో కథన ప్రదర్శన, టాలెంట్ రౌండ్లు, కార్పొరేట్ రౌండ్లు, ఇంటర్వ్యూలు, నేషనల్ కాస్ట్యూమ్, లెహెంగా రౌండ్ వంటి అనేక కఠిన దశలు నిర్వహించబడ్డాయి.

ప్రతి దశలో సౌందర్యంతో పాటు ఆత్మవిశ్వాసం, భావోద్వేగ ధైర్యం, నిజాయితీ, సహనం అవసరమయ్యాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతిభావంతమైన మహిళలతో పోటీపడి, సుదీప్తా తన లక్ష్యస్పష్టతతో ప్రత్యేక గుర్తిం పు పొందారు. ఈ సందర్భంగా సుదీప్తా మాట్లాడుతూ.. ఆ వేదికపై నిలవడం కేవలం ఒక టైటిల్ గురించి మాత్రమే కాదు. ఈ ప్రయాణం నా క్రమశిక్షణను, మనోబలాన్ని, ధైర్యాన్ని పరీక్షించింది.

కిరీటాలు తలపై ధరించేవి కాదు  అవి నమ్మకం, నిరంతర కృషి, ఆత్మవిశ్వాసంతో నిర్మించబడతాయి అని అన్నారు. ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ జంషెడ్పూర్ అలు మ్నా అయిన సుదీప్తా దాస్, భారతీయ, అంతర్జాతీయ సంస్థల్లో దశాబ్దానికి సమీపంగా హెచ్‌ఆర్ ప్రొఫెషనల్‌గా పని చేశారు. అనంతరం ప్రజల జీవితాల్లో సార్థకమైన మార్పు తీసుకురావాలనే లక్ష్యంతో ఫిట్నెస్, వెల్నెస్ రంగంలోకి అడుగుపెట్టారు.

ప్రస్తుతం గచ్చిబౌలిలో నివసిస్తున్న ఆమె, సర్టిఫైడ్ ఫిట్నెస్ కోచ్, క్లినికల్ న్యూట్రిషనిస్ట్గా ప్రపంచవ్యాప్తంగా 2,200 మందికి పైగా వ్యక్తులకు శిక్షణ అందించారు. మార్షల్ ఆరట్స్ అభ్యాసకురాలిగా, నర్తకిగా, తల్లిగా అనేక పాత్రలను సమతుల్యంగా నిర్వర్తిస్తున్నారు.