26 May, 2026 | 6:33 PM

Breaking News

దళిత సంస్థలపై రౌండ్ టేబుల్ సమావేశం   •   మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్.. అగ్రనేత నరహరి లొంగుబాటు   •   భట్టి విక్రమార్క అధ్యక్షతన కేబినెట్ సబ్ కమిటీ సమావేశం   •   బర్లీఫీట్ ఏరియాలో మచిలీపట్నంకు చెందిన వ్యక్తి మృతి   •   కేంద్రం పాలనను విమర్శించే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదు: బిజెపి జిల్లా అధ్యక్షులు   •   మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం: బావి కూలి ఐదుగురు కూలీలు మృతి   •   కనీస వేతనాల పెంపు ప్రచారమే: ఐఎఫ్‌టీయూ   •   కేఓసీ ఓబీ కార్మికులకు ఈపీఎఫ్ వెంటనే చెల్లించాలి: ఐఎఫ్‌టీయూ   •   మౌలిక వసతులు కల్పించండి: సిపిఎం   •   రూ.1000 కోట్ల భూకుంభకోణం.. బయటపెట్టిన హరీష్ రావు!   •  

చిన్న,-- మధ్య లిఫ్ట్ ఇరిగేషన్‌కు ‘న్యూగైడెన్స్’!

07-02-2026 12:59 AM
  1. రూపొందించిన ఇరిగేషన్ శాఖ సలహాదారు కే పెంటారెడ్డి
  2. ఇంజినీర్లకు హ్యాండ్‌బుక్‌గా మార్గదర్శకాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): తెలంగాణలో చిన్న, మధ్య స్థాయి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల రూపకల్పనలో ఏకరీతి ప్రమాణాలు, సాంకేతిక స్పష్టత తీసుకురావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వ లిఫ్ట్ ఇరిగేషన్ సలహాదారు కే పెంటారెడ్డి సాం కేతిక మార్గదర్శకాల(న్యూ టెక్నికల్ గైడెన్స్)ను రూపొందించారు. ఈ సాంకేతిక మార్గదర్శక పుస్తకాన్ని శుక్రవారం విడుదల చేశారు.

లిఫ్ట్ ఇరిగే షన్ రంగంలో దశాబ్దాల అనుభవం, విస్తృత ఫీల్డ్ వర్క్‌ను ఆధారంగా చేసుకుని రూపొందిన ఈ హ్యాండ్‌బుక్ ఇంజినీర్లకు మార్గదర్శకంగా నిలవనుంది. లిఫ్ట్ ఇరిగేషన్ స్కీముల రూపకల్పన, అమలులో ఎదురయ్యే సాంకేతిక లోపాలు, ప్రాక్టికల్ సమస్యలను దష్టిలో పెట్టుకుని ఈ పుస్తకా న్ని కేపీ రెడ్డి రూపొందించారు. తన వ్యక్తిగత అనుభవంతో పాటు, సి బ్బందితో కలిసి చేసిన విస్తృత ఫీల్డ్ స్టడీలను సంక్షిప్తంగా సమీకరించి ఇంజినీర్లు నేరుగా ఉపయోగిం చుకు నే విధంగా ఈ మార్గదర్శకాలను రూపకల్పన చేశారు.

మూడు విభాగాలుగా ఉన్న ఈ పుస్తకంలో అన్ని రకాల పంపింగ్ స్టేషన్లకు వర్తించే సాధారణ నియమాలు, చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల రూపకల్పన, పం ప్ హౌస్, ఎలక్ట్రికల్ ఏర్పాట్లు, మధ్య తరగతి లిఫ్ట్ పథకాల కోసం ప్రత్యేక సాంకేతిక మార్గదర్శకాల గురించి  పొందుపరిచారు. లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల రూపకల్పనలో కీలక అంశాలకు స్పష్టమైన సంఖ్యాత్మక ప్రమాణాలను ఈ పుస్తకం సూచిస్తోంది. 20 కిలోవాట్ నుంచి 5 మెగావాట్ వర కు మోటార్ సామర్థ్యం ఉన్న స్కీములను చిన్న లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు గా నిర్వచించారు.

ఇలాంటి పథకాల విషయంలో---కనీసం రెండు పంపులు తప్పనిసరిగా సూచించారు. 3 క్యూ మెక్స్ వరకు డిశ్చార్జ్ ఉంటే వీటీ లేదా సబ్‌మర్సిబుల్ పంపులు, దానికంటే ఎక్కువైతే వో ల్యూట్ పంపులు వినియోగించాలన్నారు. ప్రాజెక్ట్ ఖ ర్చులు పెరగకుండా, ఆపరేషన్ సమస్యలు తలెత్తకుండా ఈ సూచనలు ఉపయోగపడనున్నాయి. 5 నుం చి 50 మెగావాట్ల మధ్య మోటార్ రేటింగ్ ఉన్న స్కీములను మధ్య లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలుగా పరిగణించా రు. ఈ పుస్తకం ముఖ్యంగా ఇరిగేషన్ శాఖలోని యువ ఇంజినీర్లకు చెక్‌లిస్ట్‌లా ఉంటుందని పేర్కొన్నారు.