21-11-2025 06:45:40 PM
కుంటాల,(విజయక్రాంతి): కుంటాల ప్రపంచ మత్స్య కారుల దినోత్సవ వేడుకలను శుక్రవారం రోజు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా మండల కేంద్రమైన కుంటాలతో పాటు అంద కూర్ లింబ కె విట్టాపూర్ గ్రామాలతో పాటు ఆయా గ్రామాల్లోని ఘనంగా ప్రపంచ మత్స్యకారుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండాను ఆవిష్కరించారు.
మత్స్య సంపదను కాపాడాలని మత్స్య సంపదతో ఎంతో అభివృద్ధి చందవచ్చని పేర్కొన్నారు. లింబ కె.గ్రామంలో ముదిరాజ్ కులస్తులు మత్స్య కార్మికుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక గ్రామస్తులు పాల్గొని మాట్లాడుతూ.. మత్స్య సంపదతో ఆర్థికంగా అభివృద్ధి చెందవచ్చు అని పలువురు మాట్లాడారు దీంతో ముదిరాజ్ కులస్తులు మత్స్య సంపద ఎంతో విలువైందని తెలిపారు.