calender_icon.png 16 October, 2025 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సంఘాల బంద్ కు ముదిరాజ్ ల సంపూర్ణ మద్దతు..

16-10-2025 07:41:46 PM

ఆదిలాబాద్ (విజయక్రాంతి): 42 శాతం రిజర్వేషన్ ల అమలు కోసం జస్టిస్ ఫర్ బీసీ పేరుతో బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ఈనెల 18న చేపట్టే బంద్ కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నట్లు కోలీ సమాజ్ జాతీయ కార్యవర్గ సభ్యులు డాక్టర్ బొజ్జ నారాయణ ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సలేంద్ర శివయ్య ముదిరాజ్, ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు దార్ష శ్రీనివాస్ ముదిరాజ్ వెల్లడించారు. ఈ మేరకు గురువారం మీడియాతో మాట్లాడుతూ... బీసీ సామాజిక వర్గంలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు రిజర్వేషన్ల సౌకర్యం లేక అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఈనెల 18న బీసీ సంఘాలు చేపట్టిన బంద్ కు తమ సంఘాలు సంపూర్ణ మద్దతుని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

ఈ బంద్ లో ముదిరాజు శ్రేణులు అందరు పాల్గొని మద్దతు తెలియజేసి బంద్ ను విజయవంతం చేయాలని వారు కోరారు. 42 శాతం రిజర్వేషన్ అమలు అయ్యాకే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ మహాసభ జిల్లా కార్యదర్శి పొచ్చన్న, ముదిరాజ్ మహాసభ జిల్లా ప్రధాన కార్యదర్శి చాగంటి భగవండ్లు ముదిరాజ్ పట్టణ మాజీ కార్యదర్శి ఓరగంటి శ్రీనివాస్ మాజీ కోశాధికారి ఇండ్ల భూమన్న ముదిరాజ్ ముదిరాజ్ సంఘం నాయకులు , జి.గంగన్న ముదిరాజ్, మందుల దాసు ముది రాజ్ మాడవేని మోహన్ ముదిరాజ్, దయ్యాల సంతోష్ ముదిరాజ్,కొండ వెంకటి ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు