16-10-2025 07:45:22 PM
మండల బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రాజా రమణ గౌడ్.!!
శివంపేట్ (విజయక్రాంతి): శివంపేట మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రాజా రమణ గౌడ్ అధ్యక్షతన పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూటకో మాట మాట్లాడుతున్నారు అని ఒకసారి రాజ్యాంగ సవరణ ద్వారానే 42 శాతం బీసీ రిజర్వేషన్లు సాధ్యమని ఓసారి.. పార్టీ పరంగా అని మరోసారి.. బిల్లుల ద్వారా ఇస్తామని ఇంకోసారి.. ఆర్డినెన్స్ అని ఓనాడు.. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన తర్వాత అని ఇంకోనాడు.. జీవో ద్వారా అని మరో నాడు.. ఇట్ల ఒకే అంశంపై ఐదు విధాలుగా మాట్లాడటం కాంగ్రెస్ నేతలకే చెల్లుతుందని అన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బిఆర్ఎస్ కే స్పష్టత ఉందని ,ఓబీసీ శాఖ ఉండాలని కోరింది కేసీఆర్ అని గుర్తు చేశారు. పత్రిక సమావేశ కార్యక్రమంలో శివంపేట గ్రామ తాజా మాజీ సర్పంచ్ పత్రాల శ్రీనివాస్ గౌడ్, తాజా మాజీ ఉపసర్పంచ్ రాజిపేట పద్మా వెంకటేశ్వర్ ముదిరాజ్, శివంపేట గ్రామ శాఖ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య, శివంపేట మండలంలోని వివిధ గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.