25 August, 2026 | 2:52 AM

బెల్ట్‌షాపులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

25-08-2026 02:10 AM

నంగునూరు, ఆగస్టు 24 (విజయక్రాంతి): నంగునూరు మండలంలో అక్రమంగా వెలుస్తున్న బెల్ట్షాపులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నంగునూరుకు చెందిన రాగుల కనకయ్య సోమవారం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో అధికారులకు ఫిర్యాదు చేశారు.మండలంలోని పలు గ్రామాల్లో అనధికారికంగా మద్యం విక్రయిస్తూ వినియోగదారుల నుంచి అధిక ధరలు వసూలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఎక్సైజ్ శాఖ అధికారులు స్పందించి నిరంతర తనిఖీలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎంపీడీఓ శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ ప్రజావాణికి మొత్తం 9 దరఖాస్తులు అందగా,వాటిని పరిశీలించి త్వరలోనే పరిష్కరిస్తామని అధికారులు తెలిపారు.ఇదే కార్యక్రమంలో కొండంరాజుపల్లిలో జనావాసాల మధ్య గొర్రెల పాకల ఏర్పాటుపై కూడా మరో ఫిర్యాదు అందింది.