calender_icon.png 12 October, 2025 | 9:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడి రేసులో ముకిరాల మధువంశీ కృష్ణ

12-10-2025 06:58:20 PM

చిట్యాల (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ముకిరాల మధువంశీకృష్ణ తెలిపారు. జిల్లాలోని కాంగ్రెస్ కార్యకర్తల ఆకాంక్షలకు,అభిప్రాయాలకు న్యాయం చేయాలని, పార్టీ బలోపేతానికి నిస్వార్థంగా కృషి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నేను ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీలో సెప్టెంబర్ 30 2021లో గండ్ర సత్యనారాయణ రావుతో, ప్రస్తుత ముఖ్యమంత్రి, అప్పటి టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్లు తెలిపారు. అప్పటినుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేసి పార్టీకి సేవలందించే క్రమంలో పార్టీ గుర్తించి 2022లో భూపాలపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శిగా అవకాశం కల్పించరన్నారు.

పార్టీలో పనిచేసిన అనుభవం కలిగి ఉన్నానని తెలిపారు. పార్టీ సిద్ధాంతాల పట్ల నాకు గాఢమైన నమ్మకం ఉందని తెలిపారు. పార్టీని గ్రామ స్థాయిలో నుండి జిల్లా స్థాయి వరకు మరింత బలోపేతం చేసి, యువత, మహిళలు, కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాలను పార్టీలో చేర్చడం ద్వారా మళ్ళీ కాంగ్రెస్ ప్రభావాన్ని నెలకొల్పేందుకు ప్రణాళికాబద్ధంగా పని చేయాలనే సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. ఈ బాధ్యతను నా మీద వేయాలని కోరుతూ జిల్లా నిబద్ధ కార్యకర్తలు, నాయకులు, పెద్దల ఆశీర్వాదం కోరారు. జిల్లా పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలనే నా అభ్యర్థిత్వాన్ని ప్రజాస్వామ్యపరంగా పరిశీలించి, తగిన మద్దతును ఇవ్వాలని కోరారు.