calender_icon.png 12 October, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కార్మిక సమస్యలు పరిష్కరించడంలో గెలిచిన సంఘాలు విఫలం

12-10-2025 06:55:31 PM

సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి..

మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడంలో గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు పూర్తిగా విఫలమయ్యాయని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి విమర్శించారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు, ప్రాతినిధ్య యూనియన్ లు గెలిచి రెండు సంవత్సరాల కాలపరిమితి పూర్తవుతున్నప్పటికీ కార్మికుల సమస్యలు పరిష్కారం కాకపోవడంతో గెలీచిన సంఘాలపై కార్మికులు అసంతృప్తితో ఉన్నారన్నారు. ఇటీవల సిఎండితో జరిగిన స్ట్రక్చర్డ్ సమావేశంలో సొంతింటి కల, పెర్క్స్ మీద ఐటి మాఫీ, మారు పేర్లు, దసరా సెలవు మార్పు వంటి అంశాలు పరిష్కారం అవుతాయనుకున్న కార్మికుల ఆశలు సమావేశాన్నీ బహిష్కరించి అడియాశలు చేశారని గుర్తింపు సంఘంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.

కార్మికుల సమస్యలు యాజమాన్యం పరిష్కరించకుంటే అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని పోరాటాలు చేస్తామని ప్రగల్భాలు, సింగరేణి అధికారులను కలుస్తూ కార్మికులకు మాయ మాటలు చెప్పి మోసం చేశారన్నారు. ఆసుపత్రి నిర్వహణ విధానాల వల్ల సిబ్బందికి ఇబ్బంది కలుగు తుందని, ఇటు రిఫరల్ పేషెంట్లకు నష్టం జరుగు తుండగా, మరోవైపు మెడికల్ బోర్డు నిలిపి వేయడంతో  చాలా మంది కార్మికులు ఎదురు చూస్తున్నారని, ఇంటర్వ్యూలు జరిగి మెడికల్ ఫిట్ అయిన వారికి అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తున్నారని, విజిలెన్స్ పెండింగ్ కేసులు, రివ్యూల పేరుతో ఫిట్ ఇవ్వకుండా, ఇన్వాల్యుయేషన్ చేయకుండా తిప్పుకోవడం వల్ల కార్మికులు ఆర్థికంగా నష్ట పోతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

గతంలో మాదిరిగా దీపావళికి కిలో స్వీటును బహుమతిగా ఇవ్వాలని, వెంటనే దీపావళి బోనస్ చెల్లించే తేదీని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్మికులు ఏరియాలో సిఐటియును బలోపేతం చేస్తున్నారని త్వరలో అన్ని గనులపై మరింత మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారని త్వరలో వేసే కొత్త పిట్ కమిటీలలో యువతకు ప్రాధాన్యత కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ నాగరాజు గోపాల్, బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకట స్వామి, కార్యదర్శి అల్లి రాజేందర్, ఉపాధ్యక్షులు రామగిరి రామస్వామి, ఏరియా ఆసుపత్రి ఫిట్ సెక్రటరీ పసునూటి శ్రీకాంత్, సివిల్ పిట్ సెక్రటరీ రాజ్ కుమార్, కేకే 5 ఆర్గనైజర్ బద్రి ఆదర్శ్, కాసిపేట 1 అసిస్టెంట్ పిట్ సెక్రటరీ నాగవల్లి శ్రీధర్, కాసిపేట 2 ఫిట్ సెక్రటరీ బుద్ధ సురేష్, శాంతిఖని ఇంచార్జ్ జడల ప్రవీణ్ లు పాల్గొన్నారు.