దమ్మపేట ఎంఈఓగా బాధ్యతలు స్వీకరించిన పి జగపతి
27-02-2026 11:43 AM
దమ్మపేట, (విజయక్రాంతి): దమ్మపేట మండల విద్యాశాఖాధికారిగా పి. జగపతి పదవీ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎంఈఓ గా పనిచేసిన కీసరి లక్ష్మి కన్నా మండలంలో సీనియర్ అయిన జగపతికి వరంగల్ ఆర్జెడి బాధ్యతలు అప్పగించారు. జగపతి గతంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నాచారంలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేశారు. ఈ సందర్భంగా ఎం ఇ ఒ మాట్లాడుతూ మండలంలో విద్యావ్యవస్థ పటిష్టతకు కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు.




