12-10-2025 07:00:28 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామంలో ఆదివారం కాన్షీరామ్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దళిత శక్తి ప్రోగ్రాం జిల్లా బాధ్యులు రాజలింగం మాట్లాడుతూ దేశంలో సంవత్సరాల నుండి సమస్యలలో చిక్కుకున్న ప్రజల విముక్తి కోసం బుద్ధుడు, అశోకుడు, చత్రపతి శివాజీ మహారాజ్, మహాత్మ జ్యోతి రావు పూలే, బిఆర్ అంబేద్కర్, కాన్షిరాం వంటి మహాత్ములు విముక్తి ఉద్యమాలను నిర్వహించారన్నారు. వారు నిర్వహించిన ఉద్యమాల వల్లే ప్రజాస్వామ్యం నిలబడిందన్నారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం నాయకులు రాంబాబు, రాము, బాబు, రవి, విద్యార్థులు సాయిరాం, వంశీ, చింటూ, మహేష్ తదితరులు పాల్గొన్నారు.