26 June, 2026 | 1:47 AM

కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ముక్తిదా

26-06-2026 12:00 AM

సన్మానించిన న్యాయ శాఖ ఉద్యోగులు 

కామారెడ్డి, జూన్ 25 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా ముక్తిద గురువారం కామారెడ్డిలో బాధ్యతలు చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో అదన జిల్లా న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన అక్కడి నుంచి కామారెడ్డి జిల్లాకు బదిలీపై వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా న్యాయమూర్తులు డాక్టర్ సూర సుమలత, కే సుధాకర్, బి దీక్ష, ప్రధాన పరిపాలన అధికారి రామ్ చందర్రావు, ఉషారాణి, న్యాయశాఖ ఉద్యోగులు ఆమెకు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగ సిబ్బంది భుజంగరావు, వెంకట్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, నిఖిల్ రెడ్డి, కరుణ, మమత, భారసోసియేషన్ అధ్యక్షులు నారాయణ, ప్రభుత్వా న్యాయవాది శ్యామ్ గోపాల్ రావు, పబ్లిక్ ప్రాసిక్ అల్లుడు ఇతర న్యాయవాదులు, సిబ్బంది పిల్ల ప్రధాన న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు.