చెత్తకుప్పలో పాఠశాల సూచిక బోర్డు..
బాలికల పాఠశాలపై అధికారుల, సిబ్బంది నిర్లక్ష్యం
బెజ్జంకి, జూన్ 25:బెజ్జంకి మండల కేం ద్రంలోని బస్టాండ్ సమీపంలో ఉన్న ప్రభు త్వ బాలికల పాఠశాలలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. విద్యార్థులకు మార్గనిర్దేశం చేయా ల్సిన పాఠశాల సూచిక బోర్డు చెత్తకుప్పలో పడివుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. పాఠశాల ప్రాంగణంలోనే ఎంఆర్సీ (MRC) కార్యాలయం కూడా ఉన్నప్పటికీ, నెలల తరబడి బోర్డు చెత్తలో పడి ఉండడాన్ని ఎవరూ పట్టించుకోకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ఎక్కడా సూచిక బోర్డు కనిపించకపోవడంతో కొత్తగా వచ్చే విద్యార్థులు, తల్లిదండ్రులు పాఠశాలను గుర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు పాఠశాల పరిసరాల్లో చెత్త, ఎండిన కొమ్మలు, కలుపు మొక్కలు పేరుకుపోవడం పరిశుభ్రతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.విద్యార్థులకు క్రమశిక్షణ, పరిశుభ్రత, బాధ్యత గురించి బోధించే విద్యాసంస్థలోనే ఈ పరిస్థితి ఉండటం పట్ల స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు, సిబ్బంది నిర్లక్ష్య వైఖరి కారణంగానే ఈ దుస్థితి నెలకొన్నదని విమర్శిస్తున్నారు.






