2 March, 2026 | 2:29 AM

జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ముకుంద నాయుడు నియామకం

02-03-2026 12:44 AM

వనపర్తి టౌన్ మార్చి1 హైదరాబాద్ లోని ఆర్ కృష్ణయ్య కార్యాలయంలో జాతీయ బీసీ సంక్షే మ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా వనపర్తి జిల్లాకు చెందిన బీసీ నాయకులు ముకుంద నాయుడుని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నియమించారు. ఈ సందర్భంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డా. ర్యాగా అరుణ్ కుమార్ ముకుంద నాయుడుకు నియామక పత్రాలు అందజేశారు. బీసీ సంక్షేమానికి, వారి అభివృద్ధికి ముకుంద నాయుడు సేవలు దోహదపడతయాన్ని ఆర్ కృష్ణయ్య అభిప్రాయపడ్డారు.

అనంతరం ముకుంద నాయుడు మాట్లాడుతూ ‘నాపై నమ్మకం ఉంచి జాతీయ బీసీ సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యత అప్పగించిన జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు మరియు జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆర్ అరుణ్ కి కృతజ్ఞతలు తెలిపారు.

బీసీ సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు, వారి విద్య, ఉపాధి, సామాజిక భద్రత కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా బీసీ సమస్యల పరిష్కారానికి, విద్య, ఉపాధి, సామాజిక-ఆర్థిక సాధికారతపై దృష్టి పెడుతానన్నారు. ఈ బాధ్యతలు పొందుటకు సహకరించిన రాష్ట్ర నాయకత్వనికి, సహచర బీసీ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.