అలసందలకు నిప్పు పెట్టిన దుండగులు
02-03-2026 12:43 AM
గట్టు, మార్చి 1: గట్టు మండలం,తప్పెట్లమోర్సు గ్రామానికి చెందిన వాకిటి వెంకటన్న అనే రైతు సాగు చేసిన అలసందల రాశిని పొలంలో ఆరబెట్టారు.శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అలసందల రాశికి నిప్పటించారు.దీంతో రైతు పండించిన పంట కాలిబూడిద కావడంతో రైతు కన్నీరుమున్నీరయ్యారు. అందాజ 20 క్వింటాళ్ల అలసందలు కాలిపోవడం రైతు రూ.1,50,000 వాటిలిందని, ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని రైతు విన్నపించారు.




