అధికారులు సమన్వయంతో పనిచేయాలి
జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి
హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 23 (విజయక్రాంతి): నగరంలో సీజనల్ వ్యాధుల నివారణకు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి అధికారులకు సూచించారు. అడిషనల్ కమిషనర్లు, జోనల్ కమిషనర్లతో శుక్రవారం కమిషనర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల కేసుల రికార్డులను తెలసుకునేందుకు జీహెచ్‌ఎంసీ జిల్లా వైద్య అధికారులు సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలన్నారు.
ప్రతీ వారం జీహెచ్‌ఎంసీ, జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేయాలని హెల్త్ విభాగం అడిషనల్ కమిషనర్‌ను.. ఆమ్రపాలి ఆదేశించారు. శానిటేషన్ నిర్వహణలో భాగంగా రాంకీ వాహనాలు సకాలంలో వచ్చి చెత్తను తీసుకొనిపోయే విధంగా జీఐఎస్ సిస్టమ్ ద్వారా పరిశీలన చేయాలని జోనల్ కమిషప్లను ఆదేశించారు. కార్మికుల హాజరు తీసుకునే విధానంపై అధికారులకు ఆదేశాలు జారీచేశారు.






