11-02-2026 05:55:10 PM
అందజేసిన సింగిరెడ్డి పద్మారెడ్డి
ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డికి 2,16,000/-రూ. చెక్కు అందజేత
మేడిపల్లి,(విజయక్రాంతి): జీహెచ్ఎంసీ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయ నిర్మాణానికి బోడుప్పల్ మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి పద్మారెడ్డి 2,16,000/- రూపాయల చెక్కును ఆలయ చైర్మన్ బొబ్బల లక్ష్మారెడ్డికి అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా సింగిరెడ్డి పద్మా రెడ్డి మాట్లాడుతూ బోడుప్పల్ లో పురాతనమైన శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయపునర్ నిర్మాణంలో భాగస్వామ్యం కావడం చాలా సంతోషకరమని, ప్రజలందరికీ శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.
అనంతరం బొబ్బల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఆలయ నిర్మాణానికి దాతల సహకారం మరువలేనిదని రెండు లక్షల పదహారువేల రూపాయలు విరాళం అందజేసిన సింగిరెడ్డి పద్మా రడ్డికి ఆలయ కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దానగళ్ళ యాదగిరి, కొత్త కిరణ్ గౌడ్, బాల్ రెడ్డి, సత్యమూర్తి ప్రభాకర్ రెడ్డి, కీర్తన్ రెడ్డి, శ్రీహరి, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.