మీర్జాపూర్ నుంచి ముంతాజ్ బీబీ వచ్చింది!
ఓటీటీలో సంచలన విజయాన్ని నమోదు చేసుకున్న ప్రముఖ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మీర్జాపూర్’ ఇప్పుడు వెండితెరపై అలరించేందుకు సిద్ధమైంది. ‘మీర్జాపూర్’ అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాకు.. గుర్మీత్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి పునీత్‌కృష్ణ కథను అందించారు. అమెజాన్ ఎంజీఎం స్టూడియోస్, ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై రితేశ్ సిధ్వానీ, ఫర్హాన్ అక్తర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సిరీస్‌లో అలరించిన ప్రముఖ పాత్రలైన కాలీన్ భయ్యా’గా పంకజ్ త్రిపాఠి, గుడ్డూ భయ్యా’గా అలీ ఫజల్, మున్నా భయ్యా’గా దివ్యేందు శర్మ పెద్దతెరపై సరికొత్త రచ్చ చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులన్నీ విజయవంతంగా పూర్తయ్యాయి.
ఈ క్రమంలో ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 4న హిందీ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ప్రమోషన్స్‌లో భాగంగా మూవీ మేకర్స్ పాత్రల పరిచయ పోస్టర్లను విడుదల చేస్తున్నారు. తాజాగా ఈ గ్యాంగ్‌స్టర్ ప్రపంచంలోకి అందాల నటి సోనాల్ చౌహాన్ అడుగుపెట్టినట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమె ఈ సినిమాలో ముంతాజ్ బీబీ అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుపుతూ.. ‘మీర్జాపూర్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్న ముంతాజ్ బీబీకి స్వాగతం.. ఇప్పుడు వెండితెరపై అసలైన తుఫాను చెలరేగనుంది’ అని క్యాప్షన్ జత చేశారు. విడుదలైన పోస్టర్‌లో ముక్కుపుడక, లంగా ఓణిలో కనిపించిన సోనాల్ చౌహాన్ లుక్ సోషల్ మీడియాలో విశేషంగా ఆకట్టుకుంటోంది.






