24 August, 2026 | 3:33 AM

నిరుపేదల కల నిజం చేస్తున్న సర్కార్ మనది

24-08-2026 02:10 AM

మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి

మద్దూర్, ఆగస్టు 23 : ఇల్లు లేని నిరుపేదలకు ఇంటి కల సహకారం చేస్తూ అడుగులు వేస్తున్న ఏకైక సర్కార్ మన కాంగ్రెస్ ప్రభుత్వమని  మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి అన్నారు. ఆదివారం గుండుమల్ మండల పరిధిలోని ముదిరెడ్డిపల్లి గ్రామంలో  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు విక్రమ్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్ళను ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదల కల నెరవేరింది సిఎం రేవంత్ రెడ్డి పేదల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బ్యాగరి దేవమ్మ,వార్డు సభ్యులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.