calender_icon.png 14 February, 2026 | 11:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చేవెళ్ల పీఠం ‘హస్త’గతం

14-02-2026 12:36:59 AM

కాంగ్రెస్ 11, కారు 4, కమలం 3

చైర్మన్ అభ్యర్థి సమతకు అత్యధిక మెజారిటీ

అభివృద్దే ద్యేయం, ప్రజలకు పదాభివందనం

మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దేవర సమతవెంకట్ రెడ్డి

చేవెళ్ళ ఫిబ్రవరి 13(విజయక్రాంతి): కొత్తగా ఏర్పడిన చేవెళ్ల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠం అస్తగతం చేసుకుంది. చేవెళ్ల సహా 12 విలీన గ్రామాలతో 2024డిసెంబర్ 20న  ఏర్పడిన ఈ మున్సిపాలిటీలో మొత్తం ఓటర్లు - 25,371/- ఉన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రం అయినప్పటికీ దేశంలోనే చిట్టచివరి మున్సిపాలిటీగా ఏర్పడింది. ఈ పట్టణ అభివృద్ధిపై ఇక్కడి ప్రజలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు.

ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు నోటిఫికేషన్ విడుదల చేయగా ఇక్కడి ప్రజలు కాంగ్రెస్కు పట్టం కట్టారు. మొత్తం 18 వార్డులకు గాను కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 4, బీజేపీ 3 వార్డులు గెలిచాయి. మొదటి రౌండ్లో లెక్కించిన తొమ్మిది వార్డులకు గాను కారు 4, కాంగ్రెస్ 4 గెలుపొందగా బీజేపీ ఒకటి గెలిచింది.  రెండవ రౌండ్ వచ్చేసరికి కాంగ్రెస్ స్పీడ్ పెంచి 7 వార్డులు గొలుపొందగా 2బీజేపీ గెలిచింది.

మొత్తం 18 వార్డులకు గాను 11వార్డులు కాంగ్రెస్, 4 వార్డులు బిఆర్‌ఎస్, 3వార్డులు బిజెపి గెలిచాయి. మెజారిటీ వార్డులు కాంగ్రెస్కు దక్కడంతో చేవెళ్ల మున్సిపల్ పీఠం హస్తగతమైంది. రిటర్నింగ్ అధికారి గెలుపొందిన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రం అందజేశారు. మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి దేవర సమతా వెంకటరెడ్డి 707 మెజారిటీ దక్కించుకొని మున్సిపల్ కేంద్రంలో మొదటి స్థానంలో నిలిచింది. రెండవ స్థానంలో కేసారం 13వ వార్డు అభ్యర్థి  రాములుగౌడ్ 411 మెజార్టీ దక్కించుకొని ద్వితీయ స్థానంలో నిలిచారు.

కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశాం: డీసీపీ యోగేష్ గౌతమ్

చేవెళ్ళలోని ఎన్ ఎక్స్ టీ డబ్ల్యూఏవీ ఈ ఇన్స్టిట్యూట్ అడ్వానస్డ్ టెక్నాలజీస్ హైదారాబాద్ (ఫరా కాలేజీ) లో  ఓట్ల లెక్కింపు జరిగింది. ఇదే ఇన్స్టిట్యూట్లో భద్రపరిచిన బ్యాలెట్ బాక్స్ లకు మూడంతల భద్రత కల్పించామని డిసిపి యోగేష్ గౌతమ్ అన్నారు. ఎన్నికల నిర్వహణకు కట్టుతిట్టమైన ఏర్పాట్లు చేశామని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేవన్నారు.

చైర్మన్ అభ్యర్థి సమతా వెంకట్ రెడ్డి అందరికి అందుబాటులో ఉంటూ... మున్సిపల్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ఇంతటి ఘనవిజయం అందించిన ప్రజలకు పాదాభివందనాలు తెలిపారు. ఈ ఘన విజయాన్ని ఎన్నటికీ మర్చిపోలేనని ప్రజల నమ్మకాన్ని ఎప్పటికీ వమ్ము చేయనున్నారు.