బంజర గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన గ్రామ సర్పంచ్
26-06-2026 04:31 PM
ఎర్రుపాలెం,(విజయక్రాంతి): మండల పరిధిలోని బంజర గ్రామంలో సర్పంచ్ వేమిరెడ్డి అన్నపూర్ణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరాన్ని నవ శకం ఫౌండర్ మేకల రమేష్ ఏర్పాటు చేశారు.గ్రామంలోని ప్రజలు వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలని సర్పంచి పేర్కొన్నారు. ఉప సర్పంచ్, పాలకవర్గ సభ్యులు , పంచాయతీ సిబ్బంది, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.






