తెలంగాణలో 13 మంది ఐఏఎస్ల బదిలీ
హైదరాబాద్: తెలంగాణ(Telangana) రాష్ట్రంలో 13 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ(IAS Officer Transfers) అయ్యారు. సీఎం ముఖ్య కార్యదర్శిగా ఎన్.శ్రీధర్ నియామకం అయ్యారు. విపత్తు నిర్వహణ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జా, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బొజ్జాకు అదనపు బాధ్యతలు అప్పగించారు. అటవీ శాఖ ముఖ్య కార్యదర్శిగా(Principal Secretary of the Forest Department) శైలజా రామయ్యర్ నియామకం అయ్యారు. దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజా రామయ్యర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. చేనేత హస్తకళల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్ కు అదనపు బాధ్యతలు ఇచ్చారు.
గనులశాఖ ముఖ్య కార్యదర్శిగా రఘునందన్ రావుకు అదనపు బాధ్యతలు కట్టబెట్టారు. జీఏడీ(పొలిటికల్) ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ అపాంట్ అయ్యారు. మైనార్టీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శిగా అహ్మద్ నదీమ్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు. హెచ్ఎండీఏ జాయింట్ కమిషనర్ గా కె. చంద్రకళ నియామకం అయ్యారు. చేనేత, హస్తకళల జాయింట్ సెక్రటరీగా కాత్యాయనీ దేవి అపాంట్ అయ్యారు. టీజీ రెడ్కో వీసీఎండీగా ముషారఫ్ అలీ ఫారుఖీకి అదనపు బాధ్యతలు ఇచ్చారు. ఆర్ అండ్ బీ ప్రత్యేక కార్యదర్శిగా కె. గంగాధర్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ గా టి. వెంకన్న, పర్యాటక శాఖ డైరెక్టర్ గా కె. విద్యాసాగర్, ప్రజా వాణి నోడల్ అధికారిగా విద్యాసాగర్ కు అదనపు బాధ్యతలు అప్పగించారు.








