calender_icon.png 12 February, 2026 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా.. ప్రశాంతంగా మున్సిపల్ ఎన్నికలు

12-02-2026 02:37:33 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): స్వల్ప చెదురు మదురు ఘటనలు మినహా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 ము న్సిపాలిటీలకు బుధవారం నిర్వహించిన ఎ న్నికలు ప్రశాంతంగా ముగిశాయి. జయశంకర్ భూపాలపల్లి మున్సిపాలిటీలో పోలింగ్ కేంద్రం వద్ద ఓ పార్టీ నేతలు డబ్బులు పంచుతున్నారని పోలీసులకు ఫిర్యాదు చేయడం తో అక్కడికి పోలీసులు చేరుకోగా పోలీసులను చూసి డబ్బులు వదిలేసి పారిపో యా రు.

లక్ష రూపాయలకు పైగా నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జనగామలో అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కొమ్మూరి ప్రతాపరెడ్డి, ప్రశాంత్ రెడ్డిలను నాన్ లోకల్ అయినప్పటికీ పోలింగ్ కేంద్రాల్లోకి అనుమతించి, తనను లోకల్ అయినప్పటికీ పోలీసు లు అనుమతించడం లేదని జనగామ ఎ మ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పోలీసులతో వా గ్వాదానికి దిగారు. పోలీసులు అధికార పక్షానికి అండగా నిలుస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.

వర్ధన్నపేటలో కూడా ఇదే పరిస్థితి పోలీసులు అవలంబించారని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. పోలీసులు అధికార పార్టీకి అండగా నిలిచి ప్రతిపక్షాలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని, అధికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ నేతలపై దాడులకు దిగుతున్నారని ఆరోపించారు. మహబూబాబాద్ పట్టణంలో ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల నేతలు బాహబహికి దిగారు. పోలీసులు అక్కడికి చేరుకొని వారిని చెదరగొట్టారు. 

ప్రశాంతంగా పోలింగ్

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు బుధవారం ప్రశాంతంగా ముగిశాయి. భూపాలపల్లి, ము లుగు, మహబూబాబాద్, జనగామ జిల్లా కేంద్రాలతో పాటు హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ, జయశం కర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పరకాల, వర్ధన్నపేట, నర్సంపేట, కేసముద్రం, డోర్నకల్, మరిపెడ, తొర్రూరు, స్టేషన్ ఘనాపూర్ మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిం చారు.

ఆయా జిల్లా కలెక్టర్లు స్నేహ శబరిష్, సత్య శారద, రిజ్వాన్ భాషా షేక్, దివాకర టిఎస్, అద్వైత్ కుమార్ సింగ్, రాహుల్ శర్మ, ఎస్పీలు పటిష్టమైన ఏర్పాట్లు నిర్వహించా రు. అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. దీంతో ఈసారి మున్సిపాలిటీలకు జరిగిన ఎన్నికలు సజావుగా ప్రశాంతంగా ముగిశాయి. 

13న ఓట్ల లెక్కింపు

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలకు బుధవారం జరిగిన ఎన్నికల్లో పోలైన ఓట్లను ఈనెల 13న శుక్రవారం లెక్కింపు జరపనున్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఏర్పాటుచేసిన స్ట్రాంగ్ రూముల్లో బ్యాలెట్ బాక్సులను భద్రపరిచారు. ఆరోజు ఉదయం ఏడు గంటల నుండి ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీలో జరిగిన ఎన్నికల్లో అమ్మ పోలైన ఓట్ల శాతం ఈ విధంగా ఉంది.

 ములుగు: 80.41

మరిపెడ: 85.36

కేసముద్రం:86.14

డోర్నకల్:81.88

మహబూబాబాద్:75.60

తొర్రూర్:77.99

జనగామ: 79.06

స్టేషన్ ఘనాపూర్: 84.47

పరకాల: 80.16

వర్ధన్నపేట:86.23

నర్సంపేట:85.21

భూపాలపల్లి: 65.18