calender_icon.png 14 February, 2026 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వనపర్తి జిల్లాలో 4 మున్సిపాలిటీలు హస్తగతం

14-02-2026 01:27:27 AM

అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య హోరాహోరి

దాదాపు 15 ఏండ్ల తరువాత వనపర్తి మున్సిపాలిటీ హస్తగతం...

అమరచింత మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ 

వనపర్తి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి): వనపర్తి జిల్లాలో 5 మున్సిపాలిటీ లలో 4 మున్సిపాలిటీ లు (వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూరు) హస్తగతం కాగా అమర చింత మున్సిపాలిటీలో మాత్రం ఏవేని రెండు పార్టీలు ఒకరి కొకరు మద్దత్తు తెలిపితేనే మున్సిపాలిటీపై జెండా ఎగురవేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అటు అధికార ప్రతిపక్ష పార్టీల మద్య జరిగిన హోరా హోరి మున్సిపాలిటీ పోరులో  ప్రజలంతా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపారు. వనపర్తి జిల్లా వ్యాప్తంగా5 మున్సిపాలిటీల్లో మొత్తం 80 వార్డు లకు గాను కాంగ్రెస్ 46 వార్డులు, బి ఆర్ ఎస్ 20 వార్డులు, బిజెపి 9 వార్డులు, సీపీఐ ( ఎం ) 2 వార్డులు, స్వతంత్రులు 2 వార్డుల్లో గెలిచారు. కాగా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో మాత్రం బిజెపి తన ఖాతా ను ఓపెన్ చేయలేదు. 

దాదాపు 15 ఏండ్ల తరువాత వనపర్తి మున్సిపాలిటీ హస్తగతం

వనపర్తి మున్సిపాలిటీలోని ప్రజలు వినూత తీర్పునివ్వడం సహజంగా మారిం ది. చాలా స్థానాల్లో గెలుస్తారు అని ధీమా నాయకులను ఓడగొట్టి ప్రజల వెంబడి ఉన్న వారికీ అందలం ఎక్కిస్తారని మరొకసారి రుజువు చేశారు. 2007 లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ హస్తగతం తరువాత దాదాపు 15 ఏండ్ల తరువాత ఎవరి మద్దత్తు లేకుండా పూర్తి స్థాయి లో హస్తగతం కావడం పట్ల కాంగ్రెస్ అధి నాయకులు తమ సంతోషం ను వ్యక్తం చేస్తున్నారు. కాగా 

అమరచింత మున్సిపాలిటీ పీఠంపై ఉత్కంఠ

అమరచింత మున్సిపాలిటీ గా ఏర్పాటు అయినప్పటికీ విలక్షణ తీర్పును ఇక్కడి ప్రజలు ఇవ్వడం ఇక్కడ ప్రత్యేకత గా మారింది. ఏ పార్టీ కి పూర్తి స్థాయి లో మున్సిపాలిటీ పీఠం ను కైవసం చేసేందుకు ఆస్కారం లేకుండా పోయింది. మొత్తం 10 వార్డు లకు గాను బిజెపి కు 3 వార్డులు, బి ఆర్ ఎస్ కు 3 వార్డులు, సీపీఐ ( ఎం ) 1 వార్డు, కాంగ్రెస్ కు 3 వార్డు లు ఇచ్చి అందరి చూపు అమరచింత మున్సిపాలిటీ వైపు చూసేలా ప్రజలు నిర్ణయించారు. ఏ పార్టీ కై పూర్తి స్థాయి లో వార్డు ల్లో గెలుపు లేకపోవడంతో ఒకరి ఒకరు పార్టీల మద్దత్తు ఇస్తేనే మున్సిపాలిటీ పై జెండా ఎగిరే అవకాశాలు ఉన్నాయని ఎవరికీ ఎవరు మద్దత్తు ఇస్తారో వేచి చూడాలని మేధావులు చర్చించుకుంటున్నారు.